మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం మనం 25/04/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామ సమీపంలో గురువారం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తల ఇరువురుకు తీవ్ర గాయాలయ్యాయి.
మర్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మోహన్ రావు భార్య వెంకటమ్మ తమ సొంత ట్రాలీ ఆటోపై పొలం దగ్గరకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో భార్యాభర్తలు ఇరువురికి గాయాలయ్యాయి.
స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన సిబ్బంది పైలెట్ సైదా , టెక్నీషియన్ రమేష్ తక్షణమే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాయపడిన భార్యాభర్తలను పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పటల్ సిబ్బంది వారికి కావలసిన ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
