మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పార్థసారథి పురం గ్రామానికి చెందిన కళ్లెం బిక్షం గౌడ్ ఏప్రిల్ 6 తేదీన తాడిచెట్టు ఎక్కుతూప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. పెనుబల్లి మండలానికి చెందిన గౌడ సోదరులు వేముల నరసింహారావు గౌడ్, చలమాల విఠల్రావుగౌడ్, వేముల రవి గౌడ్, బజ్జూరి నాగేశ్వరరావుగౌడ్, మల్లెల శ్రీనివాసరావు గౌడ్, కళ్లెం బిక్షం గౌడ్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తగిన ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా వేముల నరసింహారావు చలమాల విఠల్రావు గౌడ్ మాట్లాడుతూ గౌడ్ సోదరులు ఎవరైనా తాడిచెట్టు ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గౌడ సోదరులు ప్రతి ఒక్కరూ లేబర్ ఇన్సూరెన్స్ కట్టాలని దాని వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని వేముల నరసింహారావు గౌడ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా చలమాల విఠల్ రావు గౌడ్ మాట్లాడుతూ ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా ఏకాగ్రతతో తాడి చెట్లు ఎక్కి దిగాలని గౌడ సోదరులకు తెలియజేశారు. ఒక గౌడ సోదరుడికి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ల కుటుంబం ఎంత మనోవేదనకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతుందో మనందరం చూస్తూనే ఉన్నామని, గౌడ సోదరులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న టాటా ఏఐజి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలియజేశారు. సహకారం అందించగలిగిన గౌడ సోదరులు చలమాల విఠల్రావు గౌడ్ ని సంప్రదించగలరు సెల్ 89781 63018.
