మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/04/2025 సోమవారం). రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మఇల్లు కేటాయించాలని సత్తుపల్లి సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెనుబల్లి మండలం బియ్యం బంజర్ లోని చలమాల సూర్యనారాయణ భవంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ప్రకటించాలని ఆ జాబితా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కాటాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వెంటనే కాటాలు వేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చలమాల విటల్రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు, చలమాల నరసింహారావు, మిట్టపల్లి నాగమణి తడికమళ్ళ చిరంజీవి కండి సత్యం చెమట విశ్వనాథం గుడిమెట్ల బాబు పాల్గొన్నారు.
