🔥 మన టివి6 న్యూస్ కదనానికి కదిలిన అధికార యంత్రాంగం. తక్షణమే చేపట్టిన చర్యలు…..
మన టివి6 న్యూస్ – రామగుండం (లోకల్ న్యూస్ జూలై 5/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు గత సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీన లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్ టి పి సి యజమాని చింతలపల్లి కిషన్ రావు అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ పై నగరపాలక కమిషనర్ కు సింగం జనార్ధన్ అనే న్యాయవాది ఫిర్యాదుపై అధికారులు సరిగా చర్యలు తీసుకోవడం లేదని జులై 6వ తేదీ మన టీవీ సిక్స్ న్యూస్ వెబ్సైట్లో ప్రచురించటం జరిగింది. దీనికి స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

అసంపూర్తిగా తొలగించిన కాంపౌండ్ వాల్ నుమన టీవీ సిక్స్ న్యూస్ వెబ్ సైట్ లో వచ్చిన కథనానికి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన జెసిబి సహాయంతో కాంపౌండ్ వాల్ ను పూర్తిగా తొలగించారు…. ఫిర్యాదుకు స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు, మన టివి సిక్స్ న్యూస్ యాజమాన్యానికి ఫిర్యాదుదారు లాయర్ సింగం జనార్ధన్ అభినందనలు తెలియజేశారు.
