మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). పెనుబల్లి మండలం చలమాల సూర్యనారాయణ భవనంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నల్లమల అరుణ ప్రతాప్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి మాట్లాడుతూ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరగబోయే మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన ప్రజా సమస్యల పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని వాటి పరిష్కారం కోసం మహాసభల్లో సమగ్రంగా చర్చిస్తారని తెలిపారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి కావాలని, విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందుబాటులోకి రావడం కొరకు, గ్రామాల్లో పట్టణాల్లో మౌలిక వసతుల సాధన కోసం ఈ మహాసభల్లో పోరాటాల రూపకల్పన చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు పార్టీ మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి నాగమణి చెమట విశ్వనాథం భూక్య ప్రసాద్ చలమాల నరసింహారావు కండెసత్యం చిలక రామచంద్రు కలకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
