మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంపెనుబల్లి మండలం కర్రాలపాడుగ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద విజయకుమార్ పర్యటించారు.
దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించిన రేషన్ సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని కర్రలపాడులో ఏడవ తేది సోమవారం దళిత కుటుంబాలను స్వయంగా కలుసుకొని వారికి రేషన్ షాప్ లో సన్న బియ్యం గురించి మట్ట దయానం అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం గొల్లమందల రాములు నివాసంలో రేషన్ సన్న బియ్యం తో వండిన భోజనాన్ని దళిత కుటుంబంతో కలిసి తిన్నారు. ఈ సందర్భంగా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి పేదవాని కుటుంబంలో సంతోషం వెల్లివిరిసిందని, పేదవాని కుటుంబ సభ్యులందరూ కడుపునిండా భోజనం భోజనం చేస్తున్నారని, పేదవాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం చాలా సంతృప్తి కరాన్ని ఇచ్చిందని అన్నారు. కర్రాలపాడు గ్రామస్తులు అందరు పేద ప్రజలకు రేషన్ లో సన్న బియ్యం అందించటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టికి, తుమ్మలకి, పొంగులేటి కి, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు.
ఈ కార్యక్రమం లో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మండల కాంగ్రెస్ నాయుకులు, గ్రామ కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
