మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని మత్తుగూడెం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ముత్తగూడెం నుండి కల్లూరు వెళ్లే రోడ్డులో ముత్తుగూడెం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద 8వ తేదీ మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆపార్మక స్థితిలో పడి ఉండటం స్థానికులు గమనించి 108 కు ఫోన్ చేశారు.ఈ గుర్తు తెలియని గాయపడిన వ్యక్తి కుడి చేతి పై ముని ప్రసాద్ అని పచ్చబొట్టు ఉన్నది.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ రాధాకృష్ణ, టెక్నీషియన్ రామకృష్ణ హుటాహుటి నా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని పెనుబల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనబలి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రజ్ఞ తన సిబ్బందితో కలిసి గుర్తు తెలియని వ్యక్తికి ప్రధమ చికిత్సచేసిన అనంతరం 108 లో ఖమ్మం తరలించడానికి ఎక్కిస్తూ ఉండగా మరణించినట్లు డాక్టర్లు ధవీకరించారు.
