google-site-verification: google78487d974c7b676c.html
Cinema

కల్లూరు లో గంజాయి కలకలం… ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

26.6KViews

# గంజాయి వినియోగిస్తూ, విక్రయిస్తున్న ముగ్గురుని అదుపులో తీసుకున్న కల్లూరు పోలీసులు.

# గంజాయి కొని విక్రయించే మరో 19 మందిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు.

మన టివి6 న్యూస్ – కల్లూరు మండలం మండలం (లోకల్ న్యూస్ జూలై 09/25). కల్లూరు మండల కేంద్రంలో మంగళవారంమద్యాహ్నం 03:30 గంటల సమయంలో ఎస్ఐ కల్లూర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా, లక్ష్మీపురం రోడ్డులో సొసైటి బిల్డింగ్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు పోలీస్ వాహన సైరన్ విని, ఒక్కసారిగా కంగారు పడి, రెండు ద్విచక్ర వాహనాలపై పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నారు.

పట్టుకున్న వారిని విచారించగా ఎస్.కె హమీద్, ఎస్.కె హబీబ్ పాషా కల్లూరు కి చెందిన వారిగా మిడియం గోవిందు పద్మగూడెం మణుగూరు పట్టణం వాసి గుర్తించారు. వీరు ముగ్గురు ఒడిషా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కి చెందిన కెందుగూడ గ్రామానికి వెళ్లి అక్కడ సన్నీ అనే వ్యక్తి వద్ద, ఒక కేజి గంజాయి 3500/- రూపాయలకి, కొనుగోలుచేసి, పంచుకుని, కొంత మొత్తం వారు త్రాగడానికి తమ వద్ద పెట్టుకుని, మిగిలినది చిన్న చిన్న పోట్లాలు చేసి అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.

పది రోజుల క్రితం తెచ్చిన నాలుగు కిలోల గంజాయిలో, హమీద్ రెండు కిలోలు తీసుకోగా మిగిలిన ఇద్దరు చెరొక కిలో తీసుకున్నారు. హమీద్ వాటాగా గంజాయిని 1) గడ్డం ప్రశాంత్ నివాసం: VM బంజర, 2) శివ మరియు 3) రామకృష్ణ, ఇద్దరి నివాసం: టేకులపల్లి గ్రామం, పెనుబల్లి మండలం, 4) బ్రహ్మతేజ నివాసం: VM బంజర, 5) శ్రీకాంత్ నివాసం: గంగదేవిపాడు గ్రామం, పెనుబల్లి మండలం, 6) హరి నివాసం: VM బంజర, 7) డియో సాయి నివాసం: బిసి కాలనీ, VM బంజర, 8) గుండ్ల శివ 9) బొడ్డు చందు, ఇద్దరి నివాసం: గోపాలకుంట, కల్లూరు 10) ఉబ్బన సుభాష్ నివాసం: అంబేద్కర్ నగర్, కల్లూరు, 11) విష్ణు, NTR నగర్, తల్లాడ, 12) కార్తీక్, 13) హరి ఇద్దరి నివాసం: తల్లాడ, 14) వంగల మణికంఠ, నివాసం: పుల్లయ్య బంజర గ్రామం, కల్లూరు 15) రఘు నివాసం: అంజనాపురం గ్రామం, తల్లాడ మండలం. 16) చింటూ మరియు 17) గోపి ఇద్దరి నివాసం: వేంసూర్, 18) బేతి నిఖిల్ నివాసం: కల్లూరు 19) ఆసిఫ్, నివాసం కల్లూరు మొదలగు వారికి అమ్మేవారిని చెప్పారు. గంజాయితో పట్టుకున్న వీరు ముగ్గురిని పోలీస్ వారు మద్యవర్తులని పిలిచి పంచనామా ద్వారా ముగ్గురుని విచారించి వారి వద్దనుండి 24,600 రూపాయల విలువైన 822 గ్రాముల గంజాయిని, రెండు చక్రవాహనాలను, 3 ఫోన్ లని జప్తు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

వీరి వద్ద గంజాయి కొన్నవారి కోసం రూరల్ సీఐ ముత్తు లింగయ్య ఆద్వర్యంలో గాలింపు చేపట్టినట్లు ఎసిపి రఘు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర చెడు వ్యసనాల బారిన పడి మంచి బవిష్యత్తు పాడుచేసుకోవద్దని, నిషేదిత గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి పట్ల చైతన్యముతో ఉండి, పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కొరినారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!