మన టివి 6 న్యూస్ (మన దేశ వార్తలు మనకోసం (04/03/2025 మంగళవారం). రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖలో 3100 మెగావాట్ల సోలార్ మరియు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చారిత్రాత్మక ఒప్పందం.
వ్యాపార విస్తరణలో సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో గొప్ప ముందడుగు.. నేడు రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎం ఓ యు. ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ శ్రీ కృష్ణ భాస్కర్, రాజస్థాన్ ప్రభుత్వం అధికారులు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని SCCL (సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) సంస్థ మరియు రాజస్థాన్ ప్రభుత్వ సంస్థ RVUNL (రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్) తో కలిసి 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ను రాజస్థాన్‌లో అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం రూ.26,200 కోట్లు వ్యయం చేయనున్నారు. మొత్తం వ్యయం, లాభాల్లో 74% సింగరేణి, 26% రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా.. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు.
జైపూర్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, Principal Secretary (Energy) & CMD of GENCO సందీప్ కుమార్ సుల్తానియా, CMD of SCCL బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు.
