మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం) మార్క్సిస్టు యోధుడు,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా మండలంలోని ఏదులాపురం, కాచిరాజు గూడెం, గుదిమళ్ల, తెల్దారుపల్లి, మద్దులపల్లి, పొన్నెకల్లు, తల్లంపాడు, ఎం.వెంకటాయపాలెం, అరేంపుల గ్రామాల్లో సుందరయ్య వర్ధంతి వేడుకలు సోమవారంఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ… ఉన్నత కుటుంబంలో పుట్టి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సుందరయ్య అని, ఆయన చనిపోయి 40 సవత్సరాలైనప్పటికి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని సుందరయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని కుల,మత రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సుదర్శన్ రావు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ, సీపీఎం సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్,షేక్ బషీరుద్దీన్, మండల నాయకులు పి మోహన్ రావు, పి సంగయ్య, నందిగామ కృష్ణ వడ్లమూడి నాగేశ్వరరావు, తోట పెద్ద వెంకట రెడ్డి, వై.ప్రసాద్ రావు, పొన్నం వెంకటరమణ, పల్లె శ్రీనివాసరావు,యామిని ఉపేందర్, పెండ్యాల సుమతీ, వరగాని మోహన్ రావు, కోటి శ్రీనివాస్,పెంట్యాల నాగేశ్వరరావు,అద్దంకి తిరుమలయ్య,పొన్నం మురళి, భాస్కరరావు, మడిపల్లి వెంకన్న, రాజశేఖర్, గాయత్రీ, యండపల్లి వెంకటరామయ్య, సీతారాం రెడ్డి, మద్ది వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.