మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/05/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండల పరిధిలో భీమవరం గ్రామంలో పని చేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కూలీల ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆపరేషన్ సింధూర్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలుగుబిడ్డ మురళీ నాయక్ చిత్రపటానికి డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, కాంగ్రెస్ నాయకుల నివాళులర్పించి, అమరవీరుల ఆత్మ శాంతి కోసం కు మౌనం పాటించారు.
అనంతరం ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాల గురించి వివరించారు. ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ని వినియోగించడం పై అవగాహన కల్పించారు. వాటర్ సప్లై ని పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,గ్రామ నాయకులు వంట్లా చంటి, బోళ్ళ విశ్వేశ్వరరావు, సుబ్బారావు , వెంకటేశ్వరరావు, వేణు, జగన్మోహన్ రావు, నాగేశ్వరరావు, నరేంద్ర ,రాంబాబు, రమేష్ సమక్షంలో కూలీలకు మజ్జిగ ప్యాకెట్ లు, బిస్కెట్లు, అరటిపండ్లు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పావని శ్రీనివాస్ రెడ్డి, మేడా వెంకటేశ్వరరావు, కాంతా రెడ్డి,ఇమ్మడి శివ,గోపి, వెంకటేశ్వరరావు మరియు గ్రామ దీపికలు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
