మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/03/2025 ఆదివారం).
విఎం బంజర్ షోరూమ్ పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి, హీరో షోరూం ఓనర్ చైతన్యరెడ్డి, మరో 5 గురిపైన వి.ఎం బంజర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
హీరో షోరూంను గత కొన్ని సంవత్సరాలుగా విఎం బంజర్ లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నడుపుతున్నారని, GST రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, కమిషన్ లకు కక్కుర్తిపడి భద్రాచలం నుండి అక్రమంగా ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చి విఎంబంజర్లోని హీరో షోరూమ్ లో విక్రయిస్తున్న చైతన్యరెడ్డి, అందుకు సహకరిస్తున్న భద్రాచలానికి చెందిన డీలర్, ఇంకొదరి పైన వియ్యం బంజర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వి.ఎం బంజర్ పోలీస్ వారు ప్రాధమిక విచారణ జరిపి అలా దొంగ దారిలో తీసుకువచ్చిన వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేపట్టినారు.
