మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం).
ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను వేరుచేసి ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం పై జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిణామం చోటు చేసుకుందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ ఉందని, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే లేదని సురేష్ నాయక్ అన్నారు. దీనిని గుర్తించిన మంత్రి పొంగులేటి తీసుకున్న నిర్ణయంపై మున్సిపాలిటీలోని గ్రామాల ప్రజల సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సురేష్ నాయక్ తెలిపారు. మునిసిపాలిటీ నుంచి వచ్చే నిధుల ద్వారా ఏదులాపురం, పరిసర ప్రాంత గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం త్వరితగతిన మున్సిపాలిటీ కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా సురేష్ నాయక్ అధికారులను కోరారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానుల తరపున నుండి ప్రత్యేక ధన్యవాదాలు భూక్య సురేష్ నాయక్ తెలియజేశారు.
