మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 13/04/2025 ఆదివారం). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాంతినగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో 13వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన బలుసుపాటి సీతయ్య , వెంకటరమణ దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకిపురంలో ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో వారి ద్విచక్ర వాహనానికి గాలిపోవడంతో బండిని నెట్టుకుంటూ బ్రిడ్జి దిగుతున్నారు.
సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన చెప్పాల రఘు మరో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనం పై (ఒకే వాహనంపై ముగ్గురు) రుద్రంపురం నుండి వస్తూ ద్విచక్ర వాహనంతో నడుచుకుంటూ బ్రిడ్జి దిగుతున్న దంపతులను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో చెప్పాల రఘుకు, బలుసుపాటి సీతయ్య , వెంకటరమణ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తీవ్ర గాయాలు అయిన బలిసిపాటి సీతయ్య, వెంకటరమణ దంపుతులను మెరుగైన వైద్య కోసం 108లో ఖమ్మం తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
