మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలోని పీహెచ్సీ నందు గర్భిణీ స్త్రీల పరీక్షల కేంద్రము నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రమునకు హాజరైన గర్భిణీ స్త్రీలకు పోషకాహారం గురించి, సహజ ప్రసవం చేయించుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు.
ప్రతి గర్భిణీ స్త్రీ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని తగిన వైద్య సలహాలు పొందాలని వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్, డాక్టర్ నీలిమ డాక్టర్ నేష్మా గర్భిణీలకు తెలియజేసినారు. యొక్క శిబిరమునకు హాజరైన వారికి యోగా శిక్షణ చేసి వారికి యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి గర్భిణీ స్త్రీ గర్భిణీ స్త్రీలందరూ యోగాను, వ్యాయామం చేసినట్లయితే సుఖ ప్రసవం అవుతుందని గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో క్లినిక్ నందు హెల్త్ సూపర్వైజర్ భద్రమ్మ , పుల్లయ్య, యోగా ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఏఎన్ఎం పద్మ, అరుణిమ, గర్భిణీలు పాల్గొన్నారు.
