మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 03/03/2025 సోమవారం).వనపర్తి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2 తేదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా పరిషత్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం, శ్రీ రంగాపురం దేవాలయం అభివృద్ది పనులు, పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం, రాజానగరం – పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ భవనం, పట్టణంలో సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ , మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి గారు, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
