మన టీవీ 6 న్యూస్- ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మన కోసం 19/06/2025 గురువారం). ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేవీపీ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని రైతులు, పెద్దలు, నాయకులు ఆర్ఐ సేవలను కొనియాడారు. ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు సెంటర్ లల్లో కేకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఐ ప్రసాద్ తన జన్మదిన వేడుకలను మండలంలోని పెద్దతండా గ్రామంలోని మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు నెలకు సరిపడా నిత్యవసరాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్ఐ ప్రసాద్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల పేరుతో అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా అభాగ్యులకు తమకు తోచినంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీను మెఫీ నిర్వాహకురాలు ప్రమీల, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.