మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/06/2025 గురువారం). ఒడిశా రాష్టం నుంచి గంజాయి తీసుకువచ్చి ఖమ్మంలో విక్రయిస్తున్న గంజాయి విక్రయిస్తున్న ముఠాను బుధవారం ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చకచక్యంగా పట్టుకున్నారు.
ఎన్ఫోర్స్మెంట్ సిఐ సంకర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం లోని కరుణగిరి వద్ద గల టీఎన్జీవోస్ కాలనీకి చెందిన రవితేజ, పాకబండ బజారు చెందిన షేక్ జిలాన్ సైఫ్, సంభాని నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ పాషా, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన గోపి, శ్రీకాంత్, సందీప్ అనే ఆరుగురు కలిసి రెండు ఒడిశా రాష్ట్రంలోని మల్కానగిరి ప్రాంతం నుండి గంజాయి తీసుకు వచ్చి కరుణగిరి బైపాస్ రోడ్డు ప్రాంతంలో విక్రయిస్తుంన్నారని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయీకరిస్తున్న ముఠాను పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు యాభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. పట్టుకున్న నిందితులను రిమాండ్ చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే గంజాయి ముఠాలోని సందీప్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఈ ఆపరేషన్లు ఎస్ఐ శ్రీహరి రావు,సిబ్బంది కరీం, బాలు, సుధీర్, వెంకటేష్, వెన్ను హనుమంతరావు, విజయ్, హరీష్, వీరబాబు తదితరులు ఉన్నారు.
