google-site-verification: google78487d974c7b676c.html
Local News

మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ నాయకులు.

32.8KViews

#420 రోజులైనా 420 హామీలలో ఒకటి కూడా సరిగా నిర్వహించలేదు.

# జాతిపిత మహాత్మాగాంధీ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు.

# ఓ మహాత్మా….ఈఅసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు..

#ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు..

#ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు.

#ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు..మన

టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం-03/02/2025 సోమవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన మండల టిఆర్ఎస్ నాయకులు.

మహాత్మునికి సమర్పించిన వినతి పత్రంలోని వివరాలు. మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్పూర్తిగా బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాం.

అయితే అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూర్తిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించి ఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది. ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లు, వేళాపాళా లేని కరెంట్ కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు. ఓవైపు రుణమాఫీ మోసం… మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు కారణమైంది ఈ కాంగ్రెస్ సర్కారు. మరోవైపు నేతన్నలకిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత బతుకులు చితికిపోతున్నాయి.

మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏడాదైనా ఉలుకూ పలుకూ లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేశారు. చివరికి బిఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారు. యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్నారు.

420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా 420 రోజులైనా సరిగా అమలుచేయని ఈ కాంగ్రెస్ సర్కారు మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలిమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. గాలి మోటర్లో వచ్చి గ్యారెంటీ కార్డు పేరిట, డిక్లరేషన్ల పేరిట దగా చేశారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పటివరకు ఆ నకిలీ గాంధీలు తెలంగాణ వైపు కనీసం కూడా కన్నెత్తి చూడలేదు…

ఓవైపు రైతులను, మరోవైపు మహిళలను, ఇంకోవైపు వృద్ధులు, వికలాంగులను, 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను, ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము. నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలకు మళ్లీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మ సర్కారుకు 420 హామీల్లో కొన్నైనా అమలుచేసే తెలివినివ్వాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాము.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!