మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం.05/02/2025 బుధవారం).
4వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వినతిపత్రం అందించారు.
సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు మండలంలో పాలిటెక్నిక్ కోర్స్ చేయడానికి విద్యార్థులకు చాలా ఇబ్బంది కరంగా ఉండడంతో కల్లూరు పట్టణ కేంద్రంలో
నూతన పాల్ టెక్నిక్ కాలేజీ, నూతన ఫైర్ స్టేషన్ ” ఏర్పాటు చేయాలని వినతిపత్రం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కోరారు.

Source:mana tv6 news