మన టివి6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 05/02/2025 బుధవారం). సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం 4వ తేదీ మంగళవారం డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గ్రామాల వారీగా కాంగ్రెస్ నాయకులు నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ త్వరలో స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుందని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ అన్నిటిని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి తెలియజేయాలని కాంగ్రెస్ నాయకులను కోరారు.
ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించేలా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తెలియజేసారు. ప్రతిపక్ష పార్టీ మాటలు ఎవరు పట్టించుకోవద్దని, ఆపార్టీ పని అయిపొయిందని అన్నారు. ఆ ప్రతిపక్ష పార్టీది ఆనాడు, ఈనాడు కేవలం మాటలు గారడీ మాత్రమేనని, వాటిని పట్టించుకోకుండా మన కాంగ్రెస్ నాయకులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లాలని తెలిపారు.
మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వున్న ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలుతో పాటు ఇవ్వని హామీలు కూడా తెలంగాణ ప్రజలకు అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలే ఈనాడు మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎటువంటి గ్రూపులు లేకుండా అందరు కలిసి కట్టుగా ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ని ఎన్నుకొని గెలిపించాలని, మీ గ్రామ అభివృద్ధి మీ చేతుల్లో వుందని అన్నారు. ఇంకా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులకు డాక్టర్ మట్టా దయానంద్ తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో తల్లాడ మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
