మనకి వి సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం – 05/02/2025 బుధవారం).
సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఐదవ తేదీ బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర కులగనన ప్రక్రియలో బిసిలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకొల్లు శ్రీనివాసరావు మాటలోని ప్రధానాంశాలు.
🔻కెసిఆర్ చేసిన సర్వే కి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేకి బిసి జనాభా సుమారు 30 లక్షల మంది తేడా కనిపిస్తుంది అసలు ఏ సర్వే నిజం.
🔻రాజ్యాంగ విరుద్ధంగా ముస్లిం మైనార్టీ ప్రజలను బిసి సామాజిక వర్గాల మధ్యలోకి తెచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిసి జనాభా లెక్కలు చూపిస్తుంది.
🔻అసలు మన రాష్ట్రవ్యాప్తంగా ఈసర్వేలో ఎక్కడా కూడా ఒక్క క్రైస్తవ మతస్తులను కులగణనలో లెక్కించలేదా? ఎందుకని, అలా అయితే ఊరికి 30 నుంచి 40 చర్చిలు ఉన్నాయి. ఒక ఊరిలో 10 నుండి 20 మంది పాస్టర్లు ఉన్నారు. మరి వారు కూడా జనాభా లెక్కల్లో పాల్గొన లేదా ?.
🔻ఈ కుల గణన మొత్తం కూడా తప్పులు తడకలా ఉంది. ఎందుకంటే ఈ కుల గణన వల్ల నిజమైన బిసిలకు అన్యాయం జరగటమే కాకుండా నిజమైన ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా అన్యాయం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్లకు మైనార్టీలు అయినటువంటి ప్రజలకు దోచిపెట్టడం దుర్మార్గమైన చర్య.
🔻 మైనార్టీలను తీసుకువచ్చి బిసి, ఎస్సీ, ఎస్టీల్లో, పెట్టడం అనేది సబబు కాదు కనుక తీన్మార్ మల్లన్న వెంటనే రాజీనామా చేసి కులగణనపై పోరాటం చేయాలని మేము బిజెపి నాయకులుగా మేము కోరుకుంటున్నాము.