మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/05/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని విఎం బంజర్ లో కొలువై ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అనుమత్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులందరూ శ్రీరామ నామం జపిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇప్పుడా దృశ్యాలు చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్