మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర రావు బంజర గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మూడు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో తెలియ రాలేదు.
ప్రమాదం చూసినవారు 108 కు ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన టెక్నీషియన్ రమేష్, పైలట్ వేణు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిహెచ్సి సిబ్బంది క్షతగాత్రునికి వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రుని డ్రైవింగ్ లైసెన్స్ పై ముత్తయ్య ఎ, ప్రసాద్, అయ్యగారి పేట సత్తుపల్లి అని ఉన్నది. క్షతగాత్రుడు స్పృహ కోల్పోయి ఉండడంతో పూర్తి సమాచారం తెలియలేదు. ప్రమాదం జరిగిన ద్విచక్ర వాహన వెనుక వైపు గౌడ్ అనే పేరు ఉన్నది. పూర్తి సమాచారం కొరకు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించగలరు.
