మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 108 వాహనంలో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది.
మండల పరిధిలోని తాళ్లపెంట గ్రామ సమీపంలో నివసిస్తున్న ఆదివాసీలకు చెందిన సుకీ అని మహిళకు ఆరవ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆశ వర్కర్ సీతమ్మ 108 సిబ్బందికి ఫోన్ చేసింది. తక్షణమే స్పందించిన 108 సిబ్బంది లొకేషన్ కు వెళ్లి పెయిన్స్ వస్తున్న సుకీని 108 వాహనం లోనికి ఎక్కించుకొని వస్తూ ఉండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆశ వర్కర్ సీతమ్మ, 108 సిబ్బంది పైలెట్ రాధాకృష్ణ, టెక్నీషియన్ రామారావు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాన్పు చేశారు.
పండుగ రోజు పండంటి మగ బిడ్డకు సుకీ జన్మనిచ్చింది. అనంతరం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్య సిబ్బంది తల్లి బిడ్డ కావలసిన వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
