మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/05/2025 గురువారం). పెనుబల్లి మండలం వి.యం.బంజరు గ్రామ పంచాయతీ పరిధిలో సీతారామపురం గ్రామానికి చెందిన శదరాసుపల్లి అంకమారావు కు చెందిన పాడి గేదె 2 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి చనిపోయినది. అంకమ్మరావు విద్యుత్ శాఖ వారికి నష్టపరిహారం కొరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.
అంకమ్మరావు తన సమస్యను స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ విద్యుత్ శాఖ వారితో మాట్లాడి 40 వేల రూపాయల నష్టపరిహాన్ని ఇప్పించారు.
ఈ 40 వేల రూపాయల చెక్కును 14వ తేదీ బుధవారం వి.యం.బంజరు గ్రామ కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి కిరణ్ కుమార్, గోగినేని రమేష్, మేకతోటి కాంతయ్య, భూక్య ప్రసాదు, వంగా వెంకటేశ్వరరావు, వంగ నిరంజన్ గౌడ్ లు కలిసి చెక్కును అంకమరావుకు అందించారు.
