మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/05/2025 బుధవారం).12 వ తేదీ సోమవారం TS 04UE 3037 బస్సులో సత్తుపల్లి ఖమ్మం నైట్ డ్యూటీ చేస్తున్న హరికి బస్ సీట్లో సాంసంగ్ ఫోన్ ఒకటి దొరికింది. అది కొనిజర్లకు చెందిన ప్యాసింజర్ శ్రీనివాసరావుది అని తెలుసుకున్న హరి ఖమ్మం డిపో నైట్ డ్యూటీ కంట్రోల్ ద్వారా శ్రీనివాసరావుకు అప్పగించడం జరిగింది.
20వేల రూపాయలు విలువ చేసే ఫోను తిరిగి దొరుకుతుందని అనుకోలేదని తనకు ఫోన్ తిరిగి అప్పగించడం పట్ల కండక్టర్ హరికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశాడు. నిజాయితీగా వ్యవహరించిన కండక్టర్ హరి ని ఆర్టీసీ ఉన్నతాధికారులు, సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి అభినందించారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్