మన టివి6 న్యూస్ – ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యం మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని మరొకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరూపించారు. ఖమ్మం రూరల్ ఎసిపి , సిఐ పోలీస్ స్టేషన్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సిపి సునీల్ దత్త్ తో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా “అమ్మ లక్ష్మి నీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయి” అని పిలిచి మహిళా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మితో ఎసిపి భవన సముదాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కొబ్బరి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు మరొకసారి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డీసీసీ ప్రసాద్ రావు,ఏసీపీలు. తిరుపతి రెడ్డి, రమణమూర్తి, రూరల్ సిఐ. రాజు, రూరల్ ఎస్ఐలు, స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
