మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025 గురువారం). సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సమక్షంలో , జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు, కీసర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ కాంగ్రెస్ నాయకుల అంగీకారంతో పెనుబల్లి మండలం వి.ఎం బంజార్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ భూక్య పంతులి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు బాలాజీ, భద్ర ,రాములు, హరియా, శంకర్, సత్యం, సోము, బాలాజీ నాయక్ , 30 మంది పైగా తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద మాట్లాడుతూ గ్రామాల్లోని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకగ్రీవ అంగీకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయుకులు సోమరాజు సీతారామరావు, కీసరి శ్రీనివాసరెడ్డి, వంగా దామోదర్, మిట్టపల్లి కిరణ్, మాజీ ఎంపీటీసీ వంగా ఝాన్సీ నిరంజన్ గౌడ్, మేకతోటి కృష్ణయ్య, గోగినేని రమేష్, తదితరులు పాల్గొన్నారు.
