మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025 గురువారం). సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని. పాత సెంటర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాతృమూర్తి అయినటువంటి ఆరోగ్యమ్మ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను స్పందించుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధముగా 500000/- రూపాయలను పాఠశాల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం…
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు,దొడ్డా శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఫయాజ్,మానుకోట ప్రసాద్,విజయ సారధి రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
