. మన టీవీ సిక్స్ న్యూస్. (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 10 2025 శుక్రవారం).
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి పట్టణం, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 59 చెక్కులను ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల మీదుగా, కాకర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. బీసీకి 23 ఇబిసి 8, ఎస్సీ10, ఎస్టి 9, షాది ముబారక్ 9 మొత్తం 59,06,844 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లబ్ధిదారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
