మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం). పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో వెనుకబడి పోయామని వారు విజ్ఞప్తి చేశారు. 2008లో వైయస్సార్ సీఎం గా ఉన్నప్పుడు జ్యోతి బా పూలే జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించారని, ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చి ప్రజాపాలనను అందించడం శుభ పరిణామం అని తెలిపారు.
మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు కేటాయించాలని, హైదరాబాదులో మాలి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని కోరారు.
మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేశారు.
