మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2025 బుధవారం) మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సీపీఎం ఖమ్మం రూరల్ మండల జనరల్ బాడీ సమావేశం మండల కమిటీ సభ్యులు వరగాని మోహన్ రావు అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో సరళ మాట్లాడుతూ…కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, 500 రూపాయలకే గ్యాస్ మొదలగు హామీలు నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆమె విమర్శించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. ఈ నెల 19వ తేదీన మార్క్సిస్టు మహానీయుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలంపై మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ వహించి, సంక్షేమ పథకాలు అర్హులైన వారికే అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్,షేక్ బషీరుద్దీన్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య,తోట పెద్ద వెంకటరెడ్డి,పి.మోహన్ రావు,వడ్లమూడి నాగేశ్వరరావు,నందిగామ కృష్ణ,భూక్య నాగేశ్వరరావు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుధాకర్,మండల కమిటీ సభ్యులు ఏటుకూరి ప్రసాద్ రావు, ధనియాకుల రామయ్య,కారుమంచి గురవయ్య, చామకూరి రవీందర్,పెంట్యాల నాగేశ్వరావు,మల్లెబోయిన రాజశేఖర్,వరగాని వెంకటేశ్వర్లు, పొన్నం భాస్కర్,చిలువేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
