బ్రేకింగ్ న్యూస్….ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి పవర్ ప్లాంట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టివిఎస్ ఎక్సెల్ మోపెడుతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టేకులపల్లి చెందిన సంగు బక్కయ్య అనే వ్యక్తి (45 సం.). టీవీఎస్ ఎక్సెల్ మోపెడు పై పవర్ ప్లాంట్ లో డ్యూటీ కి వెళ్తూ ఉండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
ప్రమాదం చూసినవారు 108కి సమాచారం అందించడంతో టెక్నీషియన్ రమేష్, పైలెట్ నాగేశ్వరరావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాయపడిన బక్కయ్యను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ వరుణ్ తన సిబ్బంది ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్