మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ పెనుబల్లి మండల కమిటి సభ్యులు పాల్గొన్న దీక్షను ప్రారంభించిన విశ్రాంతి ఉపాధ్యాయులు కవి, రచయిత గోపిశెట్టి వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ….ఎస్సీ వర్గీకరణపై వేసిన షమీ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలను సరిచేయాలని పద్మశ్రీ గౌరవ మంద కృష్ణ మాదిగ చేత వినతి పత్రం తీసుకొవటమే గాకుండా, స్వయంగా చర్చించిన అనంతరం కమిషన్ యొక్క గడువును పొడిగించి, కమీషన్ యొక్క నివేదికలో ఏ ఏ అంశాలను సరిచేశారో కనీసంచర్చించకుండా కమిషన్ యొక్క నివేదికను యధాఫలంగా ఆమోదించడమంటే మాదిగ, మాదిగ అనుబంధ కులాలను, వర్గీకరణ కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక్కసారి మోసం చేయడమేనని అన్నారు.
ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ లోని లోపాలను సరిచేసి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్ష అనంతరం వి.ఎం.బంజర్ సెంటర్ నందు నిరసన తెలియజేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కలగంటున్నాడని, ఇది ప్రజాస్వామ్యం కాదు రాజరిక వ్యవస్థ అనే లాగా వ్యవహరిస్తున్నాడని, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎమ్మార్పీఎస్ ఉద్యమ చరిత్రలో 30 సంవత్సరాలుగా ఎంతోమందిని చూసిందని, ఈ ముఖ్యమంత్రి కూడా గత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఖసీ ఖమ్మం జిల్లా నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మాదిగ, కోట ప్రసాద్ మాదిగ, మరకాల ప్రభు మాదిగ, మరకాల శ్రీను మాదిగ, మరకాల భాస్కర్ మాదిగ, మరకాల మధు, మాదిగ, మరకాల వెంకటేశ్వరరావు, మాదిగ, మంచాల బ్రహ్మం మాదిగ, ఇర్సం వెంకటేశ్వరరావు మాదిగ, లింగపోగు తిరుపతయ్య మాదిగ,బంకా ఆశీర్వాదం మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
