మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం – 02/02/2025 ఆదివారం.) 31వ తేదీ శుక్రవారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో మాజీ “ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలను వారు నిరూపిస్తే రాజీనామా చేయడానికి మేము సిద్ధం…. నిరూపించలేక పోతే సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయాలనుంచి తప్పకుంటారా ? అని సూటిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్యకు సవాలు విసిరిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్.”
గత రెండు రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సత్తుపల్లి పట్టణ కేంద్రం దద్దరిల్లిపోయింది. దీనితో సత్తుపల్లి పోలీసులు 2వ తేదీ ఆదివారం ఉదయం పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను, బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీనితో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయకుమార్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కీ వెళ్లి కాంగ్రెస్ శ్రేణులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం చరిత్ర లో ఎన్నడూ గొడవలు లేవు అని, ఈ గొడవలకు ఆజ్యం పోసింది ఎవరో మీకు తెలియదా ?, మా కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీస్ శాఖను ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ అమలలో ఉండగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బహిరంగగా మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పై, మా పై వ్యక్తి గత విమర్శలు చేస్తుంటే వారిపై కేసులు పెట్టకుండా పోలీస్ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.