మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/04/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం విఎం బంజర పోలీసులు సుమారు 1 కేజీ 110 గ్రాములు గంజాయిని నమ్మదగ్గ సమాచారం మేరకు విఎం బంజర పోలీసులు వి.ఎం బంజర్ బస్టాండ్ పట్టుకున్నారు.
పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకటరమణ ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయిని భద్రాచలం విజయవాడ వెళ్లే బస్సులో తరలిస్తున్నాడని సమాచారంతో పెనుబల్లి ఎస్ఐ కె వెంకటేష్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి వెంకటరమణను, అతని వద్ద ఉన్న గంజాయిని అదుపులోకి తీసుకున్నారు.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్