మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/04/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 11వ తేదీ శుక్రవారం ఉదయం ఉదయం 6 గంటలకు మరణించాడు. వంశీ వి.ఎం బంజర్ జిల్లా పరిషత్ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్నాడు. వంశి పేదవాడు కావడంతో స్నేహితులు వంశీని బ్రతికించుకోవడం కోసం జోలె పట్టి విరాళాల సేకరించారు, అధ్యాపకులు కూడా వంశీ కొరకు విరాళాలు సేకరించి సుమారు 3 లక్షల పైగా వంశి తండ్రి శ్రీనుకు అందజేశారు.
పదో తేదీ గురువారం హైదరాబాద్ హాస్పిటల్ లో వంశీకి ఆపరేషన్ చేసి ఎడమకాలను పూర్తిగా తొలగించారు. కాలు లేకపోయినా తమ స్నేహితుడు వంశీ బతుకుతాడని మిత్రులందరికీ సంతోషించారు. కానీ దురదృష్టం వెంటాడడంతో శుక్రవారం ఉదయం వంశీ మరణించినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. బతుకుతాడని ఆశలు పెట్టుకున్న వంశీ మరణించడంతో వి.ఎం బంజర హైస్కూల్ విద్యార్థులు కన్నీరు మునీరుగా ఏడ్చారు. దీంతో పాఠశాలలో, చౌడారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
