మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/03/2025 సోమవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్ల ద్విచక్ర వాహనంపై విఎం బంజర్ వెళుతూ ఉండగా వెనక నుండి వస్తున్న అశోక్ లేలాండ్ మినీ ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
స్థానికులు హుటాహుటిన వెంకటేశ్వర్లును పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన డాక్టర్ కిరణ్, సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వార్తకు సంబంధించిన వీడియో MANA TV6 NEWS ….. యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు.