మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం- చెన్నూరు గ్రామంలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూములు అందించిన చెన్నూరు గ్రామ రైతులకు కృతజ్ఞతలు తెలియజేసిన డాక్టర్ మట్టా దయానంద్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో అందించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ చెన్నూరు గ్రామంలో నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ స్కూల్ నిర్మాణానికి సుమారు 25 ఎకరాలు భూమి అవసరం అవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చెన్నూరు గ్రామ రైతులను సహకారం అందించాలని కోరారు.
డాక్టర్ మట్టా దయానంద్ పిలుపుమేరకు రైతులు సుమారు 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 24వ తేదీ సోమవారం స్కూల్ కు భూమిని అందించిన రైతులను ప్రత్యేకంగా కలుసుకొని పేరుపేరునా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూలుకు శంకుస్థాపన చేసుకుందామని చెన్నూరు గ్రామ రైతు సోదరులకు, చెన్నూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు డాక్టర్ మట్టా దయానంద్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ప్రభుత్వ అధికారులు, కల్లూరు ఎఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి ఎఎంసి దోమ ఆనంద్, చెన్నూరు గ్రామ రైతు సోదరులు, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు, కల్లూరు మండలం పట్టణం కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు…
