మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12-01-2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ సభ్యులు, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కేక్ కట్ చేసి ప్రియాంక గాంధీ వాద్రాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తుమ్మల ప్రధాన అనుచరులు చల్లగుండ్ల నరసింహారావు మాట్లాడుతూ కేరళలోని వయినాడ్ లోక్సభ స్థానంలో 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టినటువంటి ప్రియాంక గాంధీ భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని ఇంకెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
