మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/04/2025 గురువారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డ దుండగులు.
మండల పరిధిలోని కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు రాణి తన భర్త సత్యంబాబుతో కలసి ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి శుభకార్యానికి వెళ్లి వస్తూ ఉండగా కొత్తలంక పల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి పల్సర్ బైక్ ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలో నాలుగున్నర కాసులు బరువు ఉన్న నాన్తాడును లాక్కొని వెళ్లారు. వారు లంకపల్లి నుండి పల్లెవాడ వేంసూరు మండలంలోకి వెళ్ళినట్లు చూసిన వారు చెబుతున్నారు.
ఘటన జరిగిన సమయంలో పోటో రాణి మెడలో చంద్రహారం నాన్తాడు ఉన్నాయి అయితే చంద్రహారాన్ని గట్టిగా పట్టుకోవడంతో ఒక నాన్తాడు మాత్రమే దుండగులు చేతికి చిక్కిందని రాణి వివరించారు.