👉 టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా ?….
👉 నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు ?
👉నెలలు గడుస్తున్నా నోటీసులు ఇవ్వరు, టీఎస్ బి పాస్ ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన స్పందించరు.
మన టివి6 న్యూస్ – రామగుండం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్ టి పి సి కృష్ణానగర్ లోని ఇంటి నంబర్ 5-1-130 పై గత సంవత్సరం నవంబర్ 12వ తేదీన లిఖితపూర్వకంగా, అదే తేదీన ఆన్లైన్ ద్వారా లాయర్ సింగం జనార్ధన్ ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు పై ఇప్పటివరకు ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ అధికారీ నేరుగా వెళ్లి కలిసిన, ఫోన్ చేసి చెప్పిన, వాట్సప్ ద్వారా రిమైండర్ చేసినా కూడా ఇప్పటికైనా స్పందించి తను ఇచ్చిన ఫిర్యాదు పై చర్య తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కోరుతున్నాడు.
ఆన్‌లైన్‌లో టిఎస్-బి పాస్ ద్వారా, లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు కనీసం నోటీసు కూడా జారీ చేయకపోవడం హేతుబద్ధం కాదని జనార్ధన్ తెలిపారు. పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులను కలిసి, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా గుర్తు చేస్తూ రిమైండర్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. “ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట’’ అని వ్యాఖ్యానించిన జనార్ధన్, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటో… ఆమతలబ్ ఏమిటో అర్థం కావటం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నేను చేసిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.
