మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 7/25). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం శ్రీ నీలాద్రీ శ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం , ఆషాడమాసం, శుక్లపక్షం , ఏకాదశి తిధి ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నీలాద్రిశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఆలయ కార్య నిర్వహణ అధికారి యన్ రజిని కుమారి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు కోనేరులో స్నానమాచరించి శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము అర్చనలు చేశారు. అభిషేకాల అనంతరం స్వామి వారు ఇత్తడి నాగ భరణ అలంకరణ లో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు.
