మన టివి6 న్యూస్-ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం18/06/2025 బుధవారం)
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా సుమారు ఏడాది కాలం పాటు విధులు నిర్వర్తించిన ముజమ్మిల్ ఖాన్ పాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు.
బదిలీపై వెళ్తున్న ముజమ్మిల్ ఖాన్ ను ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయంలో దయాకర్ రెడ్డి మంగళవారం కలిసి ఆయన సేవలను కొనియాడుతూ బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ…. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి బదిలీ అయ్యేంత వరకు ముజమ్మిల్ ఖాన్ నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని దయాకర్ రెడ్డి అన్నారు.
