మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 16/06/2025 సోమవారం). తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను పెనుబల్లి మండలం వి.యం.బంజరు రింగ్ సెంటర్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ప్రెసిడెంట్ పంది వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారని, నిరంతర శ్రామికుడు నిర్విరామంగా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నటువంటి భట్టి విక్రమార్క భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలులతో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతిని.ధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, బుక్క కృష్ణవేణి, మిట్టపల్లి కిరణ్ కుమార్, నల్లమోతు వినీల, గూడూరు మాధవరెడ్డి, మేకతోటి కాంతయ్య, ఈడ కమలాకర్ రావు, మల్లెల రాజా, కర్రి కమలాకర్ రావు, గోదా చెన్నారావు, వేముల కిరణ్, చలమాల రాజ్ కుమార్, కాసులు, బాజీ నాయక్, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.