మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/05/2025 సోమవారం). పెనుబల్లి మండలం గుర్వాయిగూడెం గ్రామంలో రామాలయం, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.
ఈ సందర్భంగా ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ గురువాయిగూడెం గ్రామంలో మహా దైవ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ శ్రీరామచంద్రుడు గ్రామస్తులకు సుఖశాంతులు పాడిపంటలు సకల సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలో శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అశ్వా హవచనము, గోపూజ, విఘ్నేశ్వర పూజ, శ్రీ శీతల పరమేశ్వరి విగ్రహము, శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహము, శ్రీ పోతురాజు స్వామి గృహము, శ్రీ కోదండ రామస్వామి శిలా జీవద్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని ఇటువంటి దైవ కార్యక్రమాలకు తామెప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఎఎంసి చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
