మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు కేటిఆర్ జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని రింగ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.దళిత స్పీకర్, దళితులను, బీసీలను చిన్న చూపులు చూడటం, వారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బిఆర్ఎస్ నాయకులకి అలవాటై పోయిందని, తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రి ని చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని అదే అలవాటు బిఆర్ఎస్ నాయకులు అలవర్చుకున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీ లపై కానీ, దళిత బీసీ నాయకుల పైన కానీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె చెన్నకేశవరావు, మున్సిపల్ కౌన్సిలర్ లు మరియు మండల నాయకులు చల్లగుళ్ల నరసింహారావు ,కమల్ పాషా మరియు యన్.యస్.యు.ఐ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ గౌడ్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
