మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16/03/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి ఎంఎస్సీ కాలువ వద్ద ఘర్షణలో యువకునికి గాయాలు.
మండల పరిధిలోని విఎం బంజర్ కు చెందిన మోటం మారేష్, రాజు అనే యువకులకు టేకులపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరికి మధ్య మాట మాట పెరిగి శనివారం మధ్యాహ్నం ఘర్షణకు దారితీసింది. టేకులపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి సమీపంలోని స్థానికులను పిలవడంతో గుంపుగా వచ్చిన స్థానికులు మారేష్ ని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.
రాజు స్థానికుల సహాయంతో మారే ష్ ను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మారేష్ ను ఖమ్మం తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
