మన టీవీ6 న్యూస్- సత్తుపల్లి ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సత్తుపల్లి లో నూతనంగా నిర్మాణంలో వున్న నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించి, పనులు పరిశీలించారు. పట్టణం లో నూతన నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం నిర్మాణం జరుగుతుండగా పనులు పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్ లను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లోని మాత శిశు వార్డ్ ను, పరిశీలించారు. ఆసుపత్రి లో కాంతులకు వచ్చిన బాలింతల, పుట్టిన పసిబిడ్డల ఆరోగ్యాన్ని ఒక డాక్టర్ గా స్వయంగా పరిశీలించి, ఒక పసిపాపను డాక్టర్ లా ఆదరించి తల్లిలా ఎత్తుకొని లాలించారు. రోగులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెంట్ ని కలుసుకొని ఆసుపత్రిలోని రోగుల వివరాలు, పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు ప్రజలు ఆరోగ్య రీత్యా డాక్టర్స్, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం గా ఉండాలి అని తెలియజేసారు…… తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టి , తుమ్మల, పొంగులేటి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గుర్తు చేశారు.
